చిరుమల్ల ఆశ్రమ హైస్కూల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ఫారాల పంపిణీ

అర్హులైన గ్రాడ్యుయేట్లకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్లికేషన్ ఫారాల పంపిణీ

 

కరకగూడెం :  మండలంలోని చిరుమల్ల ఆశ్రమ హైస్కూల్లో మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాయం నరసింహారావు గారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన గ్రాడ్యుయేట్లకు అప్లికేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పాయం నరసింహారావు గారు సూచించారు.

 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  సర్పంచులు కొమరం సత్యనారాయణ, తాటిగూడెం కొమరం విజయ, రఘునాథపాలెం సర్పంచ్ పోలబోయిన రాణి, అనంతారం సర్పంచ్ కృష్ణవేణి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, మాజీ సర్పంచులు కొమరం విశ్వనాథం పోలబోయిన నరసింహారావు పాయం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram