డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్‌లో కీలక మార్పులు..

డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్‌లో కీలక మార్పులు.. పాస్ మార్కులు 75 శాతానికి పెంపు ప్రతిపా

 

సురక్షిత డ్రైవింగ్ ట్యుటోరియల్ పరీక్షలో పాస్ మార్కులను ప్రస్తుత 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.

 

లైసెన్స్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాల మార్పులకు గడువులు విధించడంతో పాటు, పరీవాహన్ పోర్టల్ ద్వారా కొన్ని ఆన్‌లైన్ సేవలను ఉచితంగా అందించాలని సూచించింది.

 

గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందినవారికి ప్రాక్టికల్ టెస్ట్ మినహాయింపు కొనసాగనుంది. ఈ మార్పులు ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి. తుది నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అమల్లోకి వస్తాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram