ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. అనంతగిరి మండలం పినకోట దగ్గర జరిగిన ఈ భారీ పేలుడులో నలుగురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ పేలుడులో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో టిప్పర్‌ పూర్తిగా ధ్వంసం అయ్యింది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

 

 

అయితే రోడ్డు నిర్మాణ పనుల్లో కొండను తొలిచేందుకు నిర్వాహకులు జిలెటిన్‌స్టిక్స్‌ పెట్టారు. అది ప్రమాదవశాత్తు పేలడంతో టీచర్‌, డ్రైవర్‌, ముగ్గురు కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులను విశాఖకు చెందిన సునీత, కార్మికులు దేవరాపల్లికి చెందిన మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్‌కుమార్‌ గుర్తించినట్లు సమాచారం

Facebook
WhatsApp
Twitter
Telegram