పాఠశాల బస్సు కు తప్పిన పెను ప్రమాదం

విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు.

బస్సు  డ్రైవర్‌కు గుండెపోటు!

 

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / గుంటూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలోనే పాఠశాల బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి విద్యుత్ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. స్థానికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే నివారించబడింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని SVN కాలనీ సమీపంలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకుబయలుదేరింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలోఅకస్మాత్తుగా డ్రైవర్‌ తీవ్రమైన గుండెనొప్పికి గురయ్యారు.నొప్పి తీవ్రతకు ఆయన బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో, బస్సు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది.

బస్సులో చిన్నారులు భయంతో కేకలు వేయడంతోగమనించిన స్థానికులు క్షణాల వ్యవధిలోస్పందించారు. వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం గుండెపోటుతో అస్వస్థతకు గురైన బస్సు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికితరలించారు. సమయానికి స్థానికులు స్పందించకపోతే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram