భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
Post Views: 22









