హత్య కేసు ఛేదించిన పోలీసులు

రూ.80 వేల అప్పు వివాదం. వ్యక్తి హత్య.

కరకగూడెం : కరకగూడెం  పోలీస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భగవత్ రవిచంద్ర హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే …

ఈనెల 12 వ తేదీన కలువల నాగారం కు చెందిన బాధావత్ విజయ అనే మహిళ కరకగూడెం పోలీస్ స్టేషన్కు వచ్చి తన కొడుకు అయినా బాధావత రవిచంద్ర ని కరక గూడెంకి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఆర్థిక లావాదేవీలను దృష్టిలో పెట్టుకొని కలువల నాగారం గ్రామం శివారులో చంపి వేసినాడని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపై కేసు నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించారు.

 

పరిశోధనలో మృతుడు అయిన బాదావత్ రవిచంద్ర ముద్దాయి ఇమ్రాన్ కు 80000 అప్పు ఇవ్వడం జరిగింది ఇట్టి బాకీ విషయంపై ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈనెల11 వ తేదీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పథకం ప్రకారం ముద్దాయి ఇమ్రాన్ మృతుడు అయినా రవిచంద్ర ను మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని కలువల నాగారం గ్రామ శివారులోకి తీసుకొచ్చి అతనిపై దాడి చేసి మెడపై బెల్టుతో గొంతు బిగించి హత్య చేసిన

 

ఈరోజు (బుధవారం) ముద్దాయి ఇమ్రాన్ ను అతని ఇంటి వద్ద అరెస్టు చేసి అతను ఇట్టి హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్ ను అదేవిధంగా రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

 

అరెస్టు చేసిన ముద్దాయిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది. కేసు పరిశోధనలో ఉన్నది

Facebook
WhatsApp
Twitter
Telegram