లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్

హైదరాబాద్ : విద్యుత్ మీటర్ల మంజూరు కోసం లంచం తీసుకుంటూ తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL)కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్లోని మాదన్నపేట సెక్షన్, సంతోష్నగర్ సబ్ డివిజన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న పండాల సందయ र्ड 5.1,20,000 లంచం తీసుకుంటుండగా 2026 అక్టోబర్ 15న ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

 

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడికి సంబంధించిన పాత విద్యుత్ మీటర్లు కనిపించకుండా పోవడంతో వాటి స్థానంలో ఆరు కొత్త విద్యుత్ మీటర్లను మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఫిర్యాదు దారుడు.ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను ఆమోదించి, ఆరు కొత్త విద్యుత్ మీటర్లను మంజూరు చేయడానికి అసిస్టెంట్ ఇంజినీర్ రూ.1.20 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం సొమ్మును స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి, ఆయన సూచన మేరకు లంచం సొమ్ము రూ.1,20,000ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ప్రభుత్వ అధికారి తన అధికారిక విధులను నిజాయితీగా నిర్వర్తించకుండా, ప్రయోజనం పొందేందుకు లంచం స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ కేసులో నిందితుడిని నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి, న్యాయ రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపింది.

 

ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram