బతుకమ్మ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌ అవార్డులకు సీఎం ఆహ్వానం

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌ అవార్డుల కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం. దిల్‌రాజు నేతృత్వంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు.

 

హైదరాబాద్ : బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌–2026 అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్‌రాజు ఆహ్వానించారు.

 

ఈ మేరకు దిల్‌రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రిని కలిసింది. ఈ బృందంలో సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, గాయకుడు నల్గొండ గద్దర్ ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram