బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాము సస్పెండ్

పార్టీ లైన్ దాటితే సహించేది లేదు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు

కరకగూడెం ఉపసర్పంచ్, BRS పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాముని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఓటర్ల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గారి అధ్యక్షతన పార్టీ నిర్ణయం

 

 

కరకగూడెం : ఈరోజు (ఆదివారం) తారీఖున కరకగూడెం మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య  ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు పార్టీ ఇన్చార్జి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ని సందర్శించి ఓటు నమోదు అయ్యే విధంగా కృషి చేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరడమైనది.అందులో భాగంగా కరకగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మరియు BRS పార్టీ మండల కార్యదర్శిగా చలామణి అవుతూ పార్టీ కార్యక్రమాలను దూరంగా ఉంటూ పార్టీపై వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడుతూ అనేక విమర్శలు చేస్తునందున బుడుగం రాము పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయించడం తీసుకోవడం జరిగింది.ఈరోజు నుండి పార్టీ కార్యక్రమంలో అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తూ ఇట్టి తీర్మానాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారికి తీర్మానం చేసి పంపడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డిగారు,మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబుగారు,రావుల కనకయ్య ,సర్పంచ్ కొమరం సత్యనారాయణ ,మాజీ సర్పంచ్లు పాయం నరసింహారావుగారు,ఊకే రామనాథం, నారాయణ ,గొగ్గలి నరసయ్యగారు,కరకగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కటకం లేనిన్గారు,ఈసం సమ్మయ్య,సీనియర్ నాయకులు గోగ్గాలి నర్సయ్య ,ఎళ్ళు రామకృష్ణారెడ్డిగారు,వట్టం వెంకటేశ్వర్లు ,గొగ్గలి నారాయణ,ఎగ్గడి శ్రీనివాస్  వైద బిక్షపతి,చిట్టీమల్ల ప్రవీణ్ గారు,సయ్యద్ పాషా,దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram