గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : భోజన ప్రియులు రుచికరమైన భోజనం కోసం ఎంత ఖర్చయినా పర్వాలేదు, కడుపుకి నిండుగా తినాలని తహతహలాడుతుంటారు. వీరి ఆకలే కొంతమందికి ఆదాయవనరులుగా మార్చుకోవాలని అనుకుంటున్నారు. లక్షలు పెట్టి ఖర్చుపెట్టి కోట్లు గుణించాలనే ఉద్దేశంతో కొంతమంది రెస్టారెంట్ యజమానులు. మావద్ద ఎక్కడ దొరకని చికెన్ మటన్ బిర్యానీలు జ్యూసి మందిలు మా ప్రత్యేకత అంటూ కస్టమర్ ఆకట్టుకొని కుళ్ళిపోయిన ఆహారం తినిపిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.
కొత్తగూడెం పట్టణం రామవరం రోడ్డులోని ఓ రెస్టారెంట్ లో అలాంటి గటనే చోటుచసుకు.ఎవరి ఆరోగ్యం ఎటు పోతే మాకేంటి మా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగాలని ఆలోచించారో ఏమో కానీ గత కొద్ది నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు, బిర్యాని, జ్యూసి మందిలు రోజుల తరబడి నిలువ చేస్తూ కస్టమర్లకు అంటగడుతున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. శనివారం రామవరం కు చెందిన ఒక మహిళ జ్యూసి మంది ఆర్డర్ చేసింది. ఆకలితో ఉందో ఏమో కానీ గబగబా నాలుగు ముద్దలు తినేసరికి ఆహారం కుళ్ళిన వాసన వచ్చే సరికి సిబ్బందిని నిలదీసింది. తప్పు కప్పిపుచ్చుకోవడానికి సిబ్బంది అనేక రకాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ కష్టమర్ ఒప్పుకో పోయేసరికి మీకేమైనా కావాలంటే చెప్పండి ఇస్తాము కానీ వ్యాపారాన్ని దెబ్బతీయోద్దు అని రావే పడ్డారు.
కానీ కస్టమర్ ఒప్పుకోకుండా. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది కుళ్లిన ఆహారాన్ని తనిఖీ చేసి రూ.5 వేలు జరిమానా విధించారు. రోజుల తరబడి మాంసాహారాన్ని ఫ్రిజ్లో ఉంచి అప్పటికప్పుడు కస్టమర్లకు వండి అందిస్తున్నారని నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నేడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెస్టారెంట్లలో రోజుల తరబడి నిలువ ఉంచిన కుళ్లిన మాంసాన్ని ప్రజలకు తినిపిస్తున్నారని ఇటువంటి రెస్టారెంట్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.









