ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి

ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు.

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : చర్ల మండల కేంద్రంలోని బీఎస్ రామయ్య భవన్లో శనివారం కారం నరేష్ అధ్యక్షతన  జరిగిన సిపిఎం పార్టీ  సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ వల్ల  ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ఆదివాసి గ్రామాల్లోని ప్రజలు  భయాందోళనకు గురి అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం విధ్వంసకరంగా సాగిస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంట నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. భారతదేశంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపద, జల వనరులు, ప్రకృతి వనరులు ఉన్నాయని వాటన్నింటినీ కార్పొరేట్  సంస్థలకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అటవీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలను వెళ్లగొట్టడానికి. మావోయిస్టులను సాకుగా చూపి ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టిందని విమర్శించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram