రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

గోల్డెన్ న్యూస్ / జనగామ / జనగామ జిల్లా కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జనగామ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై వేగంగా వస్తున్న బొలెరో వాహనం, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ  ప్రమాదంలో స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే జనగామ మండలం శామీర్‌పేటకు చెందిన అభిలాష్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram