మోకు చిలుకట్టు ఊడి క్రింద పడి కళ్ళు గీత కార్మికుడి మృతి
గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట / మండల పరిధిలోని కాసర బాధ గ్రామానికి చెందిన పోలగాని శ్రీనివాస్, వయసు 47 సంవత్సరాలు, వృత్తి కల్లుగీత కార్మికుడు, రోజు మాదిగానే ఆదివారం ఉదయం తన ఇంటి నుండి ముస్తాదు కట్టుకొని కల్లు గీయుటకు కాసరాబాద నుండి వెదురవారిగూడెం వెళ్ళు రోడ్డుకు పక్కన ఉన్న కొల్లు శివయ్య, కోసిన పొలంలో గల పరుపుతాటి చెట్టు ఎక్కి కళ్ళు గీయుచుండగా ఉదయం 6:30 గంటలకు ప్రమాదవశాత్తు మోకు చిలుకట్టు ఊడి చెట్టు పైనుండి చెట్టు మొదట్లో కింద పడగా మృతుని మొఖానికి, చేతులకు, కడుపులో బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయినాడు.మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె గలరు.మృతుని భార్య పోలగానీ వసంత దరఖాస్తు ఇవ్వగా ఎల్. పాండు నాయక్, ఏ.ఎస్.ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 235








