నేడే సంపూర్ణ సూర్యగ్రహణం

నెల 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనిని సంపూర్ణంగా లేదా పాక్షికంగా దర్శించేందుకు పలు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇది భారత్‌లో కన్పించక పోయినా 55 దేశాల్లో కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్రుడు.. సూర్యునికి, భూమికి మధ్యగా నేరుగా వెళ్లడం వల్ల మన గ్రహంపై నీడ పడుతుంది.

సూర్యుడి కాంతిని కొంత లేదా పూర్తిగా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం. 1999 తర్వాత ఐరోపా ప్రధాన భూ భాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram