చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలుబు, దగ్గు, అలర్జీల నివారణకు సాధారణంగా వాడే క్లోర్ఫెనిరమైన్ మలేట్, ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ మందుల వినియోగంపై పరిమితులు విధించింది. నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు ఈ కాంబినేషన్‌తో కూడిన మెడిసిన్స్ వినియోగించొద్దని స్పష్టం చేసింది.
కాంబినేషన్ డ్రగ్స్ పై కేంద్రం పరిమితులు
చిన్నారులకు కాంబినేషన్ మందులు వాడుద్దని సూచన
డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, నిపుణుల కమిటీ చేసిన హెచ్చరికల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఈ కాంబినేషన్ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు తమ ఔషధాల లేబుళ్లు, ప్యాకేజింగ్, ప్రచార సామగ్రిపై ‘ఈ మందును నాలుగు సంవ త్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు ఉపయోగించొద్దు’ అని స్పష్టమైన హెచ్చరికను ముద్రించాలని ఆదేశిం చింది. కాగా, ఈ ఏడాది జూన్ లోనూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా మానవ వినియోగానికి సంబంధించిన 16 ఫిక్స్డ్ డోస్ కాంబినే షన్ మందుల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది.









