గోల్డెన్ న్యూస్ /నేలకొండపల్లి/ సహజంగా పిల్లులు, కుక్కలకు అస్సలు పడదు. పిల్లి కనిపిస్తే కుక్కలు వెంట పడతాయి కసితీరా గాయపరచి చంపేస్తాయి. అలాంటిది జాతి వైరాన్ని మరచి పిల్లి పిల్లకు పాలు ఇచ్చింది ఓ శునకం.
శత్రుత్వాన్ని మరిచి కుక్క, పిల్లి పాలిచ్చి మాతృత్వాన్ని చాటుకున్న సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మేళ్లచెరువు లచ్చయ్య ఇంటి వద్ద పెంచుకుంటున్న కుక్క వద్ద పిల్లి పాలు తాగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.జంతువులు కూడా ఒక నిర్దిష్ట సమయంలో తమ భావోద్వేగ కోణాన్ని ప్రదర్శిస్తాయి. అవి ఇతర వర్గాల జంతువుల పట్ల కూడా తమ ప్రేమ మరియు ఆప్యాయతను చూపుతాయి అని అనేక సందర్భాలలో నిరూపితమైంది.
Post Views: 25









