రవిచంద్ర కుటుంబాన్ని పరామర్శించిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు

మణుగూరు : ఇటీవల హత్యకు గురైన బాదావత్ రవిచంద్ర కుటుంబ సభ్యులను వారి తల్లి ని పరామర్శించి ఓదార్చిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బానోత్ హుస్సేన్ నాయక్,బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ వీరు నాయక్, వారితో పాటు వివిధ సంఘ నాయకులు శుక్రవారం కరకగూడెం మండలం నాగారం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు బాధావత్ రవిచంద్ర ను హత్యకు గురి అయినాడు ఆ విషయంపై హత్య ఘటనపై వివరాలు గ్రహించి మణుగూరు డిఎస్పి గారిని టెలిఫోన్ ద్వారా తక్షణమే హత్యకు కారకులైన పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన వారందరినీ కూడా విచారించి వారిపై తక్షణమే చర్యలు తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు, అనంతరం తండా నాయకులు యువకులు అందరితో చర్చించి, ఇంత దూరమైనా ఎంత కష్టమైనా, ఈ ఘటనలో విచారణలో ఏదైనా న్యాయం జరగకపోతే కచ్చితంగా వారి కుటుంబాన్ని అండగా ఉండి ఎంతకు దూరమైనా పోవడానికి సిద్ధమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణా నాయక్, పినపాక నియోజకవర్గం నాయకులు, రమాబాయి, రాంబాబు నాయక్, లావుడియా హనుమంతు నాయక్, ధరావత్ మురళి నాయక్, తండా యువకులు తండా పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram