వలస ఆదివాసులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనివి..
ఏడూళ్ల బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు .
గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం మండలంలోని నీలాద్రి పేట గ్రామంలో బుధవారం ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్, ఏడూళ్ల బయ్యాారం సిఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో వలస ఆదివాసీలకు చాపలు, కర్టెన్స్, చెప్పులు, దుస్తులు, వాటర్ బాటిల్స్, సామాగ్రి పెట్టుకోవడానికి బ్యాగులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ…. మండలంలో ని వలస ఆదివాసి గ్రామాలలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. రానున్న రోజుల్లో వలసి ఆదివాసి గ్రామాలకు స్వచ్ఛత సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, వినోద్, ఉమా మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..









